కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ లెక్క చేయకుండా నెగ్గిపూడి పంచాయతీ కార్యదర్శి ఛాంబర్లో లో పెళ్లిరోజు వేడుకలు
రెడ్ జోన్ లోని పంచాయతీకార్యదర్శి ఛాంబర్లో పెళ్లిరోజు వేడుకలు???
మంత్రి చెరుకువాడ పర్యటనలో ఉండగా వేడుకలు?
నానాటికీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు
పంచాయతీ కార్యదర్శి, విఆర్వో సమక్షంలో వేడుకలు
పంచాయితీ,ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిన
ప్రైవేటు రియల్టర్ కుటుంబం హల్ చల్
ఇలా అయితే కరోనా కట్టడి ఎలా?
పెనుమంట్ర మండలం నెగ్గిపూడి లో ఘటన
పశ్చిమ గోదావరి జిల్లా/ పెనుమంట్ర, పెన్ పవర్ ప్రతినిధి.
స్థానిక ప్రజాప్రతినిధుల లాభార్జన క్షేత్రస్థాయి సిబ్బంది కక్కుర్తితో నిర్లక్ష్యం స్థానిక సిబ్బంది అవగాహన రాహిత్యం కరోనా మహమ్మారికి స్వాగతం పలుకుతుందా?ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలను పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామ క్షేత్రస్థాయి అధికారులు తుంగలో తొక్కారు ? నిబంధనల ప్రకారం నలుగురు మించి ఉండరాదు అని తెలిసి కూడా గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇటీవల బుధవారం 22వ తేదీ గ్రామపంచాయతీ పనివేళలో ఉదయం 11 గంటల సమయంలో రెడ్ జోన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా నెగ్గిపూడి గ్రామపంచాయతీ కార్యదర్శి ఛాంబర్లో పంచాయతీచే నోటీసులు జారీ చేయబడిన ప్రైవేటు వ్యక్తి,రియల్టర్లు అనధికార లేఅవుట్లు వనంపల్లి గ్రామంలో నాలుగు, నెగ్గిపూడి గ్రామంలో రెండు వెంచర్లు వేసి పంచాయతీ ప్రభుత్వా ఆదాయానికి భారీగా గండి కొట్టిన రియల్టర్ కుటుంబంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు, గ్రామ రెవిన్యూ అధికారి మాధవరావు దగ్గరుండి స్థానిక సచివాలయ సిబ్బంది వాలంటీర్ లను సైతం చేర్చి ఆ పెళ్లి రోజు వేడుకలు నిర్వహించడం విస్మయం కలిగించింది.రెడ్ జోన్ లో భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న సమయంలో భౌతిక దూరాన్ని పాటించాలన్న కనీస అవగాహన కూడా మరిచి, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు, మండల శాఖ అధికారుల అనుమతులు తీసుకోకుండా, సమీపంలో ఎక్కడ బేకరీల సైతం దుకాణాలు తెరవకుండా నిబంధన ఉన్నప్పటికీ పెళ్లిరోజు వేడుకల భాగంగా కేక్ ఏర్పాటు చేసి కట్ చేయడం, ఒకరికొకరు తినిపించుకోవడంపై గ్రామ అధికారుల తీరుకు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో గ్రామాలలో మరిముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాలలో మాస్కులు ధరించకుండా, నలుగురు మించి ఎక్కువ సంఖ్యలో అనుమతించకూడదని ఉన్న నిబంధనలు సైతం పట్టించుకోకుండా గ్రామ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వీటికి సంబంధించి సోషల్ మీడియా తదితరాల్లో ఫోటోలు ఉన్నప్పటికీ మండల, డివిజన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండటం చూస్తుంటే ఏ స్థాయిలో వారికి ముడుపులు అందాయో??? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెనుగొండకు కూతవేటు దూరంలో ఉన్న నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి చాంబర్లో జరిగిన ఈ పెళ్లి రోజు వేడుక పై గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి సమక్షంలో జరిగిన ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తే, కరోనా వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పనికి అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పెళ్లిరోజు వేడుకలు జరిగి నాలుగు రోజులు కావస్తున్నా అధికారుల ఎటువంటి చర్యలు లేకపోవడంతో నెగ్గిపూడి గ్రామ సచివాలయంలో వివిధ శాఖల సిబ్బంది మేము ఏమైనా చేసుకోవచ్చు,మమ్మలను కాపాడటానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అనే గర్వంతో భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించి కుండా ఉండటం మరింత అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు
No comments:
Post a Comment