ఏరులై పారుతున్న నాటు సార
పెన్ పవర్, గోపాలపురం
కరోనా వైరస్ ప్రభావంతో అధికారులు విధి నిర్వహణలో, ప్రజలు భయాందోళనలో ఉండగా అక్రమ నాటు సార వ్యాపారులు నాటు సారాను ఏరులై పారిస్తున్నారని మండల ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబందనల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయడంతో గోపాలపురం మండలంలో నాటు సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయినపట్టీకి ప్రొహిభిషన్ అండ్ ఎక్సయిజ్ అధికారుల పట్టించుకోవడం లేదని ప్రజలు వాపొతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం గోపాలపురం మండలంలోని వాలదాలకుంట గ్రామంలో వికలాంగుడైన కండవల్లి పెదరాజు అనే గ్రామ వాలంటీర్ ఆ గ్రామంలో సారా అమ్ముతున్న ఒక వ్యక్తి వద్ద నాటుసారాను పట్టుకుని గ్రామపెద్దలకు తెలియజేయడంతో పాటు పోలవరం ఎక్సయిజ్ అధికారులకు కూడా సమాచారంను వాలంటీరు అందించాడు. అయినప్పటికీ ఎక్సయిజ్ అధికారులు స్పందిచలేదని ఆ వాలంటీరు విలెేకర్ల వద్ద అవేధన వ్యక్తం చేశాడు. ఇదిలా వుండగా గోపాలపురంలోని మండలంలో దాదాపు అన్నీ గ్రామాలలో పది ఇళ్ళకోక సారా కొట్టు అన్నట్టుగా నాటు సారా విక్రయాదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపొయింది. ఏజెన్సీ గ్రామలకు ఆనుకుని వున్న గోపాలపురం మండలానికి నిత్యం నాటుసార సరఫరా అవుతునేవుంది. ఈ నాటుసారను అరికట్టాకపొతే ప్రాణనష్టం లేకపొలేదని మహిళలు ఆందోళన చేందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ నాటు సారను నియంత్రించేందుకు చర్యలు తీసుకోకపొతే అనేకమంది మందుబాబులు మంచనా పడే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
No comments:
Post a Comment