Followers

కరోనాను కట్టడి  చేయడానికి పారిశుధ్యమే ప్రధానం 


                                                                      


                                కరోనాను కట్టడి  చేయడానికి పారిశుధ్యమే ప్రధానం 


                                      గ్రీన్ జోన్ కోసం ఏడడుగుల వ్యూహం


                                                   జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం, 


 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోనే  కరోనా కట్టడి చేయవచ్చునని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ తెలిపారు.   ఇంతవరకు మన జిల్లా గ్రీన్ జోన్ లో ఉందని, దానిని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరారు.   ఈ.ఓ.పి.ఆర్.డి , పంచాయత్ సెక్రటరీ లతో  పారిశుధ్యం పై  బుధవారం  కలెక్టర్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యంగా గ్రామాల పరిశుభ్రత,  పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత తోనే వ్యాధులను దూరం చేయవచ్చని తెలిపారు.  అన్ని వార్డులు, ఎస్.సి. కలోనీలలో క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలనీ సూచించారు.  నీళ్ళ  ట్యాంక్ లను పరిశుభ్రం చేయాలనీ,  టాంకుల వద్ద పిచ్చి మొక్కలను తొలగించాలని,  మురుగు కాలవలను, ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించాలని, మురికి కుంటలను శుద్ధి చేయాలనీ ఆదేశించారు. వచ్చే జూన్ నుండి  సీజనల్ వ్యాధులు సంక్రమించే సమయమని, ముందుగానే జాగ్రతలు తీసుకోవాలని అన్నారు.  ఎక్కడైతే  పారిశుధ్యం మెరుగ్గా ఉంటుందో అక్కడ వ్యాధులకు అవకాశం  తక్కువ ఉంటుందని, ఉదాహరణకు కరోనా వ్యాధి కేరళ లో తక్కువ కేసులు నమోదయ్యాయని, వచ్చినవి కూడా తగ్గడానికి ప్రధాన కారణం అక్కడి  పారిశుధ్యమేనని అన్నారు. ప్రస్తుతం మనం సురక్షితంగా ఉన్నామని,  ఇక పై కూడా  ఇలాగె ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


కరోనా ను అడ్డుకోడానికి ఏడడుగుల వ్యూహం:


 జిల్లాలో కరోనా  పాజిటివ్ రాకుండా చూడడం లో ఏడడుగుల వ్యూహాన్ని అమలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.   వ్యాధి  నిరోధానికి ముందుగా చర్యలు తీసుకున్నామని అందులో భాగంగానే ఇంటింటి సర్వే చేయించడం జరిగిందని , ప్రతి ఇంటికి వెళ్లి 6 రకాల సర్వేలు చేయించడం జరిగిందన్నారు.  సర్వే లో అనుమానం ఉన్న వారందరిని క్వరంటైన్ కు పంపడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు.  జిల్లాలో  కరోనా కోసం 6 ఆసుపత్రులను  మందులు, వైద్యులు, సిబ్బంది, బెడ్స్ , వెంటిలేటర్స్, ఐ.సి.యు , ఇతర ఎక్విప్మెంట్ తో సిద్ధం చేయడం జరిగిందన్నారు.  సానిటషన్ పై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందని, పారిశుధ్య పనులను నిరంతరం  జరిగేల చూసామని అన్నారు.  ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి కోసం, నిరాశ్రయుల కోసం 19 షెల్తెర్లను  నిర్వహించి 3 వేల మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు.  నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండేలా చూస్తూ, ధరల నియంత్రణ పై కూడా దృష్టి పెట్టి సఫలీక్రుతం అయ్యామని అన్నారు.  కాంటైన్మేంట్  వ్యూహం క్రింద  పోలీస్ సహకారం తో జిల్లాలో  ప్రధాన మార్గాల్లో, నేషనల్ హై వేస్ లో, లింక్ రోడ్ల లో  40 చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి,  పక్క జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి రాక పోకలను నిలిపి వేయడం జరిగిందని     అన్నారు.  ఈ  ఏడు వ్యుహాలతో జిల్లాను గ్రీన్ జోన్ లో ఉంచగాలిగమని తెలిపారు. అదే విధంగా    మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నందున చేపట్టవలసిన విధి విధానాలను వివరించారు.


          ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు,  జిల్లా పంచాయతి అధికారి సునీల్ రాజ్ కుమార్ , ఇతర  అధికారులు పాల్గొన్నారు.   


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...