మీ బాధ్యత మాది అంటున్న జేనసేన నాయకులు
విశాఖపట్నం/మధురవాడ, పెన్ పవర్
మధురవాడ జోన్ వన్ ఆరవవార్డు బక్కనపాలెం గ్రామం జనసైనికులను జనసేన భీమిలీ నియోజకవర్గపు ఇంచార్జ్ పంచకర్ల సందీప్ పరామర్శించారు.జనసేన కార్యకర్తలు రాయిన రామారావు,సత్యాల పూర్ణ చంద్రరావు లాక్ డౌన్ ప్రకటించక వారం రోజుల ముందు యధావిధిగా జీవన మనుగడ కోసం చేసే మార్బుల్ వర్క్ కి వెళ్ళగా పని చేస్తుండగా మార్బుల్ ఒకటి చేయి జారి కాళ్ళ పై పడటం జరిగింది.రెండు కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి.పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత కదలలేని పరిస్థితి ఏర్పడింది.వీరిని పంచకర్ల సందీప్,బివి కృష్ణయ్య,పోతిన నానజీ పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితులు కాళ్లకు తగిలిన గాయాల విషయమై అడిగి తెలుసుకున్నారు.జనసేన నాయకులు పోతిన నానాజీ జనసేన సీనియర్ నాయకులు బి.వి కృష్ణయ్య,పంచకర్ల సందీప్,జనసేన ఆరవ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని పోతిన అనురాధ జనసేన కార్యకర్తలతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.నెలరోజులకి సరిపడే నిత్యావసరాలు,చేతిఖర్చులకు గాను కొంత రుసుమును జనసేన ఆరవవార్డు కార్పొరేటర్ అభ్యర్థిని పోతిన అనురాధ,పోతిన నానాజీ చేతుల మీదుగా అందజేశారు.జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ పార్టి తరుపున వారిని అన్ని విధాలా ఆదుకుంటాం అని భరోసా ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన ఆరవవార్డు అధ్యక్షులు సంతోష్ నాయుడు,పోతిన నానజీ, నాగోతి ప్రకాష్,అప్పలరాజు,సాయి, సింగ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment