...
కోవిడ్ ఆసుపత్రి వైద్యులు సిద్ధంగా ఉండాలి
కోవిడ్ ఆసుపత్రి సన్నద్దత పై కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్
విజయనగరం, పెన్ పవర్
ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ఆసుపత్రికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని , అన్ని రకాల వసతులు, వనరులను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ వైద్యాధికారు లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మిమ్స్ కోవిడ్ ఆసుపత్రి లోని ఏర్పాట్లను వార్డులలో పర్యటించి తనిఖీ చేసారు. కోవిడ్ ఆసుపత్రిలో అందుబాటు లోనున్న వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్స్ , సెక్యూరిటీ తదితర అంశాల పై ఆరా తీసారు. ఆసుపత్రి లో ప్రస్తుతం అందుబాటులోనున్న వైద్య పరికరాలు, వైద్యులు వినియోగించే వ్యక్తిగత రక్షిత పరికరాలు, మాస్క్ లు, మందులు, అత్యవసర వైద్యానికి అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్లు , ఐ.సి.యు సేవలు తదితర అంశాలను తనిఖీ చేసారు. వెంటిలేటర్లను నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక సిబ్బంది, పేషెంట్ కేస్ మేనేజ్మెంట్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆసుపత్రుల సమన్వధికారి డా. నాగభూషణ రావు, పల్మనాలజిస్ట్ డా. హరి కిషన్ కు ఆదేశించారు. శాంపిల్ కలెక్షన్ టీం లను సిద్ధంగా ఉంచాలని, పేషెంట్ల తరలింపు కోసం అంబులెన్సు వాహనాలను , సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందిని సన్నిద్దం చేయాలని , కేసులున్నా లేకున్నా అందరూ ప్రతి రోజు హాజరు కావాలని సూచించారు. మిమ్స్ వద్ద ఒక కోవిడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని, అవుట్ పోస్ట్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేయాలని , ప్రవేశ, బయట మార్గాలలో సి. సి. కెమెరా లను అమర్చాలని సూచించారు. ఎంత మంది వైద్యులు, సిబ్బంది అవసరం అవుతారో, ఏమేమి ఇతర అవసరాలున్నాయో వెంటనే తెలియజేయాలన్నారు. కోవిడ్ ఆసుపత్రి వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ చూడాలని, బ్లీచింగ్, పారిశుధ్యం, సెక్యూరిటీ తదితర అవసరాలను ఏర్పాటు చేయడమే కాక, అను నిత్యం ఆసుపత్రి అధికారులతో చర్చిస్తూ సమన్వం తో పని చేయాలని , ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని నెల్లిమెర్ల తహసిల్దార్ రాము, నగర పంచాయతి కమీషనర్ అప్పల నాయుడు కు ఆదేశించారు.
ఆసుపత్రిలోని ఏర్పాట్ల పై డి.సి.హెచ్.ఎస్ నాగభూషణ రావు, డా. హరి కిషన్ కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ ఆసుపత్రి లో 3 అంబులెన్స్ వాహనాలతో పాటు 50 ఆక్సిజన్ బెడ్స్ , 11 వెంటిలేటర్ లు, 50 పి.పి.ఇ లు, 300 ఎన్-95 మాస్క్ లు, వెయ్యి సర్జికల్ మాస్క్ లు, సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 200 మంది వైద్యులు, 90 మంది నర్సింగ్ స్టాఫ్, 70 మంది సానిటరీ సిబ్బంది, 50 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ 3 బాచ్ లుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు వివరించారు. కరోనా మరణాలు సంభవిస్తే వాటి కోసం జిప్ బాగ్ లు అవసరమౌతాయని ప్రస్తుతానికి కోవిడ్ ఆసుపత్రి లో కేసులను ట్రీట్ చేయడానికి అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ తనిఖీ లో మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తి రాజు, ప్రిన్సిపాల్ లక్ష్మి కుమార్, సూపరింటెండెంట్ డా. సి. రఘు రామ్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా. వర్మ రాజు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment