Followers

పారిశుద్ధ్య సిబ్బంది ని సన్మానించిన వెలగపూడి.


 


పారిశుద్ధ్య సిబ్బంది ని సన్మానించిన వెలగపూడి.


ఆరిలోవ. పెన్ పవర్ : కూచిపూడి భాస్కర్ కుమార్ 


తూర్పు నియోజకవర్గం. 9 వ వార్డు టీడీపీ అభ్యర్థిని బుడుమూరి అఖిల. ఆధ్వర్యంలో విశాలాక్షినగర్. ఎస్సీ, ఎస్టీ, కాలనీ. సంజీవ్ నగర్ ప్రాంతాలలో ప్రతి ఇంటికి మాస్కులు, గ్లౌజులు, హోమియో మందులు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి వార్డ్ శానిటేషన్ సిబ్బంది  ఇన్స్పెక్టర్ మంగరాజు, మేస్త్రి సూరిబాబులను సన్మానించి, భోజనం పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో వైద్యులు. పారిశుద్ధ కార్మికులు. పోలీసు సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారని  వారిని సన్మానించడం మన బాధ్యత అని,  దానిలో భాగంగా తొమ్మిదో వార్డు లో పారిశుద్ధ  సిబ్బంది ని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు, ప్రజలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బంది కూడా  సూచనలు పాటించాలని, వ్యక్తిగత దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి. ఈ సమయంలో ప్రజలు అందరు  ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బుడుమూరి గోవిందు అక్కర బోయిన రాంబాబు. శ్రీనివాస్ రెడ్డి. చంటి. రాజు. రవి. సురేష్. నాగరాజు. కనకరాజు. నర్సింగ్. ఫకీర్ భూలక్ష్మి. అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...