Followers

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలి


 


(స్టేట్ బ్యూరో చింతా వెంకటరెడ్డి, అమరావతి, పెన్ పవర్ )


 


స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ అధికారులకు సూచించారు. 


నేడు ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.


 కరోనా వైరస్ ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని కనగరాజ్ వ్యాఖ్యానించారు.


 గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 


చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలన్నారు.


స్థానిక సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమని కనగరాజ్ పేర్కొన్నారు. 


జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సమాయత్తంగా ఉండాలని సూచించారు. 


సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. 


స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అత్యంత కీలకమన్నారు. 


చక్కటి అవగాహనతో కమిషన్‌కు మంచి పేరు తీసుకురావాలని అధికారులకు కనగరాజ్ సూచించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...