పేదలకు అండగా తెదేపా నాయకులు కామేష్
అనకాపల్లి, పెన్ పవర్ :వానపల్లి రమణ
పేద ప్రజలకు అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు 84వ వార్డ్ ఇంచార్జ్ అరేపు కామేష్ పేర్కొన్నారు. లాక్ డోన్ తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆదివారం చేయూతను అందించారు. కొత్తూరు నర్సింగ్ రావు పేట, నెయ్యల వీధి, కుంచా వారి వీధి ల లో పేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలన్నారు. వ్యాధిని సామాజిక దూరం పాటించి తరిమి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందల సూచనల మేరకు తాను కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సుమారు 1000 కుటుంబాలకు అందజేశారు.
కె సత్యనారాయణ, జాజి మొక్కల అప్పలరాజు, కసిరెడ్డి అప్పలకొండ, సిరసపల్లి పైడ్రాజు, కె .రత్నకుమారి , రేబాక ఈశ్వరరావు, గణపతి, కుంచా చిన్న బాబు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment