అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.
ఏలేశ్వరం, పెన్ పవర్ : మాధవ్
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సేవలు అభినందనీయమని ఏలేశ్వరం ఏ ఎస్ ఐ ఎం. స్వామి నాయుడు పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో పేద ప్రజలు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గత 20రోజులుగా అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసి పేద ప్రజల ఆకలి తీర్చడం అభినందించాల్సిన విషయం అన్నారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ట్రస్ట్ సభ్యులు లింగంపర్తి, ఏలేశ్వరం , యర్రవరం , ప్రత్తిపాడు లో పేదవారికి యాచకులకు భోజనం మరియు వాటర్ బాటిల్స్ పంచిపెట్టారు. ఏలేశ్వరం ఏపీఎస్ ఆర్టిసి కార్మికులు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తమ వంతు సేవ చేస్తున్న కార్మికులకు వాటర్ బాటిల్స్ ,టీ , ట్రస్ట్ నుండి పంచి పెట్టారు. నర్సీపట్నం రోడ్ లో దుర్గాదేవి గుడి దగ్గర ఉన్న రిక్షా కార్మికులకు ఐదు కేజీల బియ్యం నూనె,పప్పులు, నిత్యవసర వస్తువులు మరియు ఏ ఆధారమూ లేని నిరుపేదలైన కొంతమందికి పది కేజీల బియ్యం, నూనె ,పప్పులు నిత్యవసర వస్తువులు ఈరోజు లింగంపర్తి రోడ్డు లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ట్రస్ట్ చైర్మన్ మాసరి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో వితరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొవ్వ శ్రీరామచంద్రమూర్తి , నూకల సుబ్రమణ్యం, పలివేల లవ రాజు తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment