Followers

అంతర్ జిల్లాల దొంగ అరెస్టు


 

89 కాసుల బంగారం,240 గ్రాముల వెండి,

 

రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం

 

రావులపాలెం, పెన్ పవర్

 

చెడు వ్యసనాలకు బానిసై ఉభయ గోదావరి జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు.  మంగళవారం రాత్రి రావులపాలెం సి.ఐ వి.కృష్ణ వివరాలు వెల్లడించారు. మల్కిపురం మండలం గుడిమెల్లంక గ్రామానికి చెందిన మామిడిశెట్టి నరేష్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు వృత్తిగా ఎంచుకుని వరుసగా ఇంటి, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రి సమయంలో తాళాలు పగలుకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.  గతంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పలుమార్లు అరెస్ట్ అయినట్లు ఆయన తెలిపారు. ఇతను వద్ద 89 కాసుల బంగారం , 240 గ్రాముల వెండి , రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ  16,31800 రూపాయలు  ఉంటుందని తెలిపారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రావులపాలెం ఎస్సై పి.బుజ్జి బాబు,ఆత్రేయ పురం ఎస్సై  జి.నరేష్,పి.గన్నవరం ఎస్సై జి. హరీష్ కుమార్ లను సి.ఐ.కృష్ణ అభినందించారు. వారికి  రివార్డులు  ఇవ్వనున్నట్లు అమలాపురం డి ఎస్ పి మషూమ్ భాషా,జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్ లు తెలిపినట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...