దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలేకర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ
మధురవాడ, పెన్ పవర్
కారోనా మహామ్మారిని తరిమికోట్టె పోరులు విధులు నిర్వహిస్తున్నా విలేకర్లకు దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు.మధురవాడ పరిధిలో విధులు నిర్వహిస్తున్న విలేఖర్లకు నిత్యావసర వస్తువులు అందించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షరాలు సి.హెచ్ విశాలక్షి మాట్లాడుతూ కారోనా మహమ్మారిని తరిమికొట్టే పోరులో పోలీస్,వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందితో పాటు పాత్రికేయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు.తమ ఆరోగ్యాన్ని,ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారని అన్నారు.అందుకే తమ వంతు సామాజిక భాద్యతగా వారికి నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.కార్యక్రమంలో డి.దినబంధు,మేజర్ టి.బ్రహ్మానంద రెడ్డి,రుాప,ధృవ కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment