శ్రీ భధ్రావతి భావనారాయణ స్వామి జయంతి సందర్భంగా పేదలకు
అన్నదానం
పెన్ పవర్, జమ్మలమడుగు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలోని పద్మశాలి కులస్థుల దైవం శ్రీ భధ్రావతి భావనారాయణ స్వామి
జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు.ఈరోజు అన్నదానం నిర్వహించిన మోరగుడి పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కారణంగా దినసరి కూలీలకు ,నిరుపేద చేనేతలు రోజు వారి పనులు లేక పస్థులు ఉంటున్నారు. అయితే వారి ఆకలిని అర్థం చేసుకుని ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి లాక్ డౌన్ విధించిన రోజు నుంచి అన్నదానం చేస్తున్నారు, అలాగే ఈరోజు పద్మశాలి కులస్థుల దైవం శ్రీ భావనారాయణ స్వామి జయంతి సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మరియు పద్మశాలి కులస్థులు కలిసి దేవస్థానం ఆవరణలోని వంటశాలలో భోజనాలు తయారు చేసి ఆహర పొట్లాలు సిద్ధం చేసి మోరగుడి, దొమ్మరనంద్యాల ,జమ్మలమడుగు లోని గ్రామ వాలంటీరులు,అర్భన్ సిఐ మధుసూధన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 400 మంది పేదలకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుగుణంగా గ్రామ వాలంటీరులతో పేదల ఇంటి వద్దకు వెళ్ళి వారికి అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సభ్యులు శింగనమళ్ళ క్రిష్ణమూర్తి, మేడికుర్తి నరసింహులు,ఆంజనేయులు, లక్ష్మీ నారాయణ, శీలా శ్రీను, దొంతి వేంకటేషు ,జింక రామకృష్ణ,రమణ, వైసీపీ ఎంపిటిసి అభ్యర్థి ఆరవేటి బాబు,వద్ది సుబ్బ రాయిడు ,పుల్లయ్య, దుద్యాల రమేష్,పద్మశాలి కులస్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment