ఎమ్మెల్యే అమర్ నాథ్ చేయూత
అనకాపల్లి, పెన్ పవర్
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ జర్నలిస్టులకు చేయూతనందించారు. లాక్డౌన్ నేపధ్యంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు సోమవారం సహాయం అందించారు. బియ్యం పప్పులు వంటి సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు ఆదుకోవడంలో ముందుంటారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు లాక్ డౌన్ లో ఎవరు ఇబ్బందులు పడకూడదన్నదే తమ ప్రయత్నంగా చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా ప్రతినిధులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాను సాయం చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీ రామరాజు, మండల అధ్యక్షులు గొర్లె సూరిబాబు, యువజన రాష్ట్ర కార్యదర్శి పలకా రవి ,యువజన కార్యదర్శి జాజుల రమేష్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, బీశెట్టి జగన్ , కొణతాల మురళీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment