జే.ఎన్..టి యు క్వరెంటైన్ కేంద్రంలో మత్స్యకారులను పరామర్సించిన జే.సి
దుప్పట్లు పళ్ళు, సానిటైసర్లు పంపిణి చేసిన వై.సి.పి నేత మజ్జి శ్రినివాస రావు
విజయనగరం, పెన్ పవర్
కర్ణాటక నుండి వచ్చిన విజయనగరం జిల్లకు చెండిన మత్స్యకారులను సంయుక్త కలెక్టర్ జే.సి.కిషోర్ కుమార్ బుధవారం పరామర్శించారు. వేట నిమితం వెళ్ళిన 85 మంది మత్స్యకారులు సోమవారం రాత్రి జిల్లాకు రాగ వారికీ ప్రాధమికంగా పరీక్షలు నిర్వహించి కారోనా లక్షణాలు లేనప్పటికీ బయట నుండి వచ్చినందున వారిని 14 రోజుల పటు క్వరెంటైన్ లో ఉంచడం జరిగింది. బుధవారం జే.సి కిషోర్ కుమార్, వై.సి.ఫై నేత మజ్జి శ్రీనివాస రావు, అర్ .డి.ఓ హేమలత క్వరెంటైన్ లో నున్న వారిని కలిసి మాట్లాడారు.
జే.సి మాట్లాడుతూ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ప్రభుత్వ నిబంధనల ననుసరించి నిర్బంధం లో ఉన్హడం జరిగిందని, ఈ నిర్బంధం మీ కోసం, మీ కుటుంభాల కోసం, సమాజం కోసమేనని హితవు పలికారు. మీరు ఆరోగ్యంగా మీ గ్రామాలకు వెళ్తే మిమ్మల్ని అందరు గౌరవిస్తారని, లేకుంటే అనుమనంగా చూస్తారని, 14 రోజులు ఉంది వ్యాధిని జయైంచిన గర్వంతో స్వంత వుల్లకు వెళ్ళాలని అన్నారు.
వై.సి.ఫై నేత మజ్జి శ్రీనివాస రావు బాధితులకు దుప్పట్లు, తువ్వాళ్ళు, మాస్క్ లు, శానిటైసర్లు, పళ్ళు అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఏ ఏ గ్రామాలకు చాందిన వారని అడిగారు. మత్స్యకారులు మాట్లాడుతూ చింతపల్లి, కొనడ, తిప్పలవలస, ముక్కం గ్రామాలకు చెందినవారమని చెప్పారు. మీకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని, మాతో సహకరించాలని శ్రీనివాసరావు కోరారు. అధికారులంత నిత్యం అందుబాటులో ఉంటూ మిమ్మల్ని బంధువుల్లా చూసుకుంటారని అన్నారు. ఎలాంటి అవసరలున్న, వైద్య సహకారం కావాలన్నా తనకు ఒక్క ఫోన్ చేస్తే అన్ని ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వారి వినోదం కోసం పెద్ద టెలివిషన్ ను ఏర్పాటు చేయాలనీ జే.ఎన్.టి.యు యాజమాన్యం తో చెప్పారు. అలాగే నిత్యం పారిశుధ్య పనులు జరగాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాల త్రిపుర సుందరి, తహసిల్దార్ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment