ఐ న్యూస్ తెలుగు దినపత్రిక సౌజన్యంతో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ మీడియా మిత్రులకు కాయగూరల పంపిణీ .
ఎం.వి.పి. కాలనీ , పెన్ పవర్ : మొహమ్మద్
విశాఖపట్నం... ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సమయంలో సమాజం శ్రేయస్సు కోసం శ్రమించే మీడియా మిత్రులకు ఐ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ కాశీమహంతి సంతోష్ కుమార్ సౌజన్యంతో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సీతంపేటలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ మీడియా జర్నలిస్టులకు,చిన్న పత్రికల సంపాదకులకు తన సొంత నిధులతో కూరగాయల ప్యాకెట్లను సీనియర్ జర్నలిస్ట్ మనభూమి సత్యనారాయణ చేతులు మీదుగా కాశీమహంతి సంతోష్ కుమార్ అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వాలు విధించిన లాక్ డోన్ సందర్భంగా మన జర్నలిస్టుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టు మిత్రులకు తన వంతు చిరు సాయం అందించాలనే సంకల్పంతో కూరగాయల పంపిణీ చేశానని, అలాగే జై భరత్ నగర్ గ్రామ అధ్యక్షుడు డా, బొగ్గు శీను, 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొడ్డేటి అనురాధ వారి ఆధ్వర్యంలో కంచరపాలెం జై భరత్ నగర్ లో ఐన్యూస్ తెలుగు దినపత్రిక ఆర్థిక సౌజన్యంతో సుమారు 400 మంది ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించాం అని తెలియజేశారు. ఈ సేవ కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా లాక్ డౌన్ కొనసాగే అన్ని రోజుల్లో తన వంతు సాయం చేస్తూనే ఉంటానని ఐన్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ కాశీ మహంతి సంతోష్ కుమార్ తెలియజేశారు .ఇప్పటివరకూ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అబ్బాస్, ఆనంద్ , భాస్కర్ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment