రెడ్ జోన్ ప్రాంతాలలో చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు సిబ్బంది తనిఖీ లు
నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5,100 కేసులు నమోదు పరిచినట్లు 11,600 మందిని అరెస్టు
పెన్ పవర్, పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ : రాము
ఏలూరు రేంజ్ ఏలూరు డీఐజీ శ్రీ కే. వి మోహన్ రావు ఐపిఎస్ ఏలూరు పట్టణ పరిధిలో ఉన్న ఫైర్ స్టేషన్ సెంటర్, అర్.అర్ పేట, తంగెళ్లముడి , తుర్పువిది , వై.యస్.అర్ కాలనీ లలో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలలో పర్యటించి చెక్ పోస్ట్ ల వద్ద ఉన్న సిబ్బంది ను తనిఖీ లు నిర్వహించినారు. ఈ తనిఖీల్లో భాగంగా పికేటూ ల వద్ద ఉన్న సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అదే సమయంలో రోడ్డుపై అనవసరంగా సంచరిoచ రాదు అని చెప్పినారు. అనంతరము ఆర్ ఆర్ పేట లో ఉన్న రెడ్ జోన్
ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి వైద్యాధికారులను విచారించి ప్రైమరీ కాంటాక్ట్ ,సెకండరీ కాంటాక్ట్ ఎంతమందికి టెస్ట్ చేశారు ఎంతమందికి పాజిటివ్ వచ్చిందన్న విషయం పై విచారించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఏలూరు రేంజి పరిధిలో 27 రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లు పశ్చిమగోదావరి జిల్లా నందు 14 రెడ్ జూన్ ప్రాంతాలను గుర్తించినట్లు సదరు ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా భయపడకుండా లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ సహకరించాలని తెలియజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు రేంజ్ పరిధిలో ఇప్పటివరకు నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5,100 కేసులు నమోదు పరిచినట్లు 11,600 మందిని అరెస్టు చేసినట్లు, 96,000 వాహనాలపై ఎం.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 5.కోట్లు 50 లక్షలు అపరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 4,900 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు గా, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొన్న 5,100 కేసులు నమోదు పరిచి 11,000 మందిని అరెస్టు చేసినట్లుగా తెలియజేసినారు. మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ విధించిన రు. ఏలూరు రేంజి పరిధిలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద 24/7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది ఉద్యోగ నిర్వహణ చేయించినట్లు సదరు చెక్పోస్ట్ వద్ద ధర్మం స్కానింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా లో చింతలపూడి , జీలిగుమిల్లి, కలపరు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఇతర రాష్ట్రాల నుంచి ఏలూరు రేంజ్ పరిధిలోకి రాకుండా మరియు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ సిబ్బంది యావన్మంది పాటు పడుతున్నారని . వైద్య పరముగా అత్యవసర పరిస్థితులు ఏర్పడినచో అన్ని జిల్లాల యొక్క ఎస్ టి లకు వాసు ఇవ్వమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సా వాంగ్ యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ 8332959175, ఈస్ట్ గోదావరి జిల్లా 9494933233, రాజమహేంద్రవరం, 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లకు వైద్య సదుపాయం కొరకు ప్రయాణం చేయు వారు పై ఫోన్ యొక్క వాట్సాప్ లకు సందేశం పంపించిన యెడల సదరు అభ్యర్థనను ఎస్పీలు పరిశీలన చేసి మీ ఫోన్ లకు ధ్రువ పత్రాలు పంపుతారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి యొక్క ఆదేశాలపై 55 సంవత్సరాలు నిండిన సిబ్బందికి కోవి డు 19 విధుల నుండి వారికి వెసులుబాటు కల్పించినట్లు రెడ్ జోన్ ప్రాంతాలలో విదిలు నిర్వహించే సిబ్బందికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసినట్లు మాస్కులు శా నీ టైజర్స్ లను సమకూర్చి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తూ తగిన జాగ్రత్తలను సలహాలను ఇస్తున్నారు ఈ సందర్భంగా డి. ఐ.జి తెలియజేసినారు
No comments:
Post a Comment