.
అనకాపల్లి, పెన్ పవర్
కరోనా వ్యాధి నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ , ఎంపీ సత్యవతి లతో కలిసి బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నియంత్రణకు అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని కోరారు. నిత్యావసర సరుకులు ధరలు ఎక్కువ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధరల పర్యవేక్షణకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో, తహసీల్దార్ ,వ్యవసాయ శాఖ అధికారులు ఈ కమిటీలో ఉంటారన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ఈ 14 రోజులు సామాజిక దూరాన్ని పాటించి వ్యాధి సంక్రమించే అవకాశాలు ఇవ్వకూడదన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యాధి నియంత్రణకు నిత్యం కృషి చేస్తూనే ఉన్నారన్నారు. అధికారుల సేవలు మరువలేనివిగా చెప్పారు. ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ గ్రామాల్లో వార్డుల్లో ఇప్పటికే పారిశుధ్య పనులు పూర్తిగా నిర్వహించినట్లు వెల్లడించారు. వ్యాధి ప్రబలకుండా క్షేత్ర స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరించామన్నారు. నిత్యావసర సరుకుల ధరలను వ్యాపారులు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. అనకాపల్లిలో 108 వాహనాలు మూడు ఉన్నాయని అదనంగా ఇంకా వాహనాలు కావాలని మంత్రిని కోరారు. సమావేశంలో అధికారులు ఆర్డీవో సీతారాం, తహశీల్దార్ ప్రసాద్, డిసిహెచ్ నాయక్, గోవిందరావు, ఎంపిడిఒ, నాయకులు మందపాటి జానకిరామరాజు ,జాజుల రమేష్ ,దంతులూరి దిలీప్ కుమార్ , గొర్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment