అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ
పెన్ పవర్, గోపాలపురం
నాటు సారా తయారు చేసే వారిపై విక్రయా దారులపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వి.సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. బుధవారం మండలంలోని లాక్ డౌన్ కారణంగా స్థానిక ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కరిచర్లగూడెం శివారు మాతంగఅమ్మ గుడి వద్దకు వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతము నుండి ఒక మోటార్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 15 లీటర్ల నాటు సారాను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్దనున్న మోటార్ బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
No comments:
Post a Comment