వైద్య సిబ్బంది కి మంచి నీళ్ల బాటిళ్లు వితరణ
పెన్ పవర్, జమ్మలమడుగు
కడప జిల్లా జమ్మలమడుగు లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ భారిన పడకుండా ప్రజలకు ఇంటింటికి తిరిగి సలహాలు సూచనలు, జాగ్రత్తలు తెలియచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైద్యులు,ఆశా కార్యకర్తలు,నర్సులకు జమ్మలమడుగు లోని రోటరీ క్లబ్ మరియు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో మంచి నీళ్ల బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ మధుసూదన్ రావు, రోటరీ క్లబ్ మెంబర్లు ,లాయర్ల సంఘం సభ్యులు మురళి ధర్ రెడ్డి, భూతమాపురం సుబ్బారావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment