కొవిడ్ ఆసుపత్రికి నిత్యావసర సరుకులు విరాళం
(బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు )
జిల్లా కొవిడ్-19 ఆసుపత్రిగా గుర్తించిన మిమ్స్ లో వైద్యులు, సిబ్బంది, వ్యాధిగ్రస్తులకు భోజన సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ ఆసుపత్రి కి ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్-2 ఆర్. కూర్మ నాథ్ చొరవతో పలు సంస్థలు 15 రోజులపాటు భోజనం కల్పించేందుకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు. జిల్లా కాళింగ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ను కలసి తమవంతుగా సహాయాన్ని అందజేశారు. కొవిడ్ రోగుల కోసం వైద్యులు, సిబ్బంది ఎంతో సేవా నిరతితో తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ సేవ చేస్తున్నారని వారికి తమవంతు తోడ్పాటు అందించేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాళింగ సేవా సంఘం గౌరవాధ్యక్షులు పేడాడ జనార్ధన రావు, అధ్యక్షులు రోనంకి నాగార్జున, ప్రధాన కార్యదర్శి కంచరాన మురళీధర్, కోశాధికారి పూజారి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment