Followers

బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే


పేద బ్రాహ్మణ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు 


పార్వతీపురం, పెన్ పవర్


తన పార్వతీపురం నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవారిని కైనా కష్టం వచ్చింది అని తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు... పేద కుటుంబాన్ని ఆదుకొనే క్రమంలో పార్వతీపురం పట్టణం ప్రధాన రహదారిలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబ పెద్దను కోల్పోయిన పరిస్థితి అలా ఉండగా మరోవైపు ఆ కుటుంబానికి చెందిన పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం కూడా కుదిరినది.


ఈ ఆకస్మిక పరిణామంతో ఆ పేద బ్రాహ్మణ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లోకి జారుకున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే  అలజంగి జోగారావు  దృష్టికి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే  స్పందించి తక్షణ సహాయం కింద 5000 రూపాయలు 25 కేజీల బియ్యం బ్రాహ్మణ కుటుంబానికి సహాయం చేయడమే కాకుండా వారి సమస్యపై తన తోటి మిత్రులకు తెలియపరచగా వారంతా కూడా తక్షణమే స్పందించి వారు సమకూర్చిన 50 వేల రూపాయల చెక్కును  అర్చకుని కుమార్తె వివాహానికి బట్టలను గురువారం స్థానిక ఎమ్మెల్యే జోగారావు  చేతులు మీదుగా బ్రాహ్మణ కుటుంబం నివాసం వద్ద ఆర్చకుని భార్యకు అందజేయడం జరిగినది. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఇదే కాకుండా భవిష్యత్తులో ఏ కష్టమొచ్చినా తామంతా అండగా ఉంటామని వారికి భరోసా కల్పించి వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...