Followers

వై.యస్.ఆర్.రైతు భరోసా-పి.యం.కిసాన్ పధకం జాబితా సమర్పణ

వై.యస్.ఆర్.రైతు భరోసా-పి.యం.కిసాన్ పధకం జాబితా సమర్పణ


రైతుభరోసా పోర్టల్లో వివరాలు తెలుసుకొండి


30వ తేదీలోగా గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి


                   సంయుక్త సంచాలకులు యం . ఆశాదేవి


 


విజయనగరం, పెన్ పవర్ :


 


  వై.యస్.ఆర్.రైతు భరోసా-పి.యం.కిసాన్ పధకం  -2020-21 నకు గాను అర్హులైన లబ్ధి దారుల జాబితాను వై.యస్.ఆర్.రైతు భరోసా పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని   వ్యవసాయ శాఖ   సంయుక్త సంచాలకులు యం . ఆశాదేవి తెలిపారు.    ఈ ప్రక్రియ      ఏప్రెల్ 30వ తేది  వరకు జరుగునని, దీనికి గాను 2019-20 సంవత్సరము లో లబ్ధి పొందిన రైతుల జాబితాను ఆయా గ్రామ  సచివాలయము లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  జిల్లా రైతాంగం స్పందన కార్యక్రమములో వినతులు సమర్పించిన రైతులు దయ చేసి వారి వివరములును రైతుభరోసా పోర్టల్ లో తెలుసుకొనుటకు మీ గ్రామ సచివాలయములో మీ గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు మండల వ్యవసాయ అధికారి వారిని ఈనెల 30వ లోపు సంప్రదించి అర్హతను బట్టి  ఈ పధకములోలబ్ధి పొందగలరని సంయుక్త వ్యవసాయ సంచాలకులు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...