పీ ఎం పీ, ఆర్ ఎం పీ లు సేవలకు సిద్ధంగా ఉన్నాం..
మండపేట, పెన్ పవర్
జిల్లాలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా గ్రామీణ వైద్యులుగా కొనసాగుతున్న పీ ఎం పీ, ఆర్ ఎం పీ లు మెడికల్ ఎమర్జెన్సీ గా ప్రజల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాథమిక వైద్య అనుభవం ఉన్న తామంతా హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రజలకు అవసరమైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోన అసోసియేషన్ తరపున తెలియజేశారు.
No comments:
Post a Comment