Followers

మూగజీవాలను ఆదుకుంటున్న పోలీసులు




 





మూగజీవాలను ఆదుకుంటున్న పోలీసులు

 

 

పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్, పెన్ పవర్   :  రాము 

 

 

పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్  సందర్భముగా ఏలూరు పట్టణములో రోడ్లపై ఉన్న మూగజీవాలు ఆవులు పశువులకు ఆహార పదార్థాలు అందక అలమటిస్తున్న మూగజీవాలను గమనించి ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలపై   ఏలూరు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు  మరియు సిబ్బంది రోడ్లపై సంచరించుచున్న మూగజీవాలకు ఆహార పదార్థాలు పచ్చి గడ్డి, ఎండు గడ్డి,  కూర గాయలను ఏలూరు పట్టణము లో ఉన్న సుమారు 100  మూగజీవాలకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ తో పాటు ఏలూరు రూరల్ యస్. ఐ చావా సురేష్ మరియు వారి సిబ్బంది యావన్మంది పోలుగొని  మూగ జీవాలకు ఆహార పదార్థాలు అందించి నారు. ఒక వ్యాను పై  పచ్చిగడ్డి ఎండుగడ్డి మరియు కూరగాయలను పట్టణం అంతా తిరిగి ఆవులకు గోవులకు పశువులకు అందించడంలో రూరల్ సిఐ  యొక్క దాతృత్వమునకు అధికారులందరూ అభినందించారు ఏలూరు ఓల్డ్ బస్టాండ్ సెంటర్ వద్ద పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ కరీముల్లా షరీఫ్  స్వయముగా  గోవులకు ఆహార పదార్థాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అదనపు ఎస్పి అడ్మిన్  మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏలూరు రూరల్ సిఐ ని ప్రత్యేకంగా   అభినందించారు


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...