Followers

NCN నెట్వర్క్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు నిత్యావసర వస్తువులు పంపిణీ.


NCN నెట్వర్క్ నీలం నాగేంద్రప్రసాద్ వారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు నిత్యావసర వస్తువులు పంపిణీ.

 

నిడదవోలు, పెన్ పవర్

 

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సిటీ కేబుల్ అధినేత నీలం నాగేంద్రప్రసాద్ ఆర్థిక సహకారంతో మీడియా మిత్రులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు, ncn అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మహమ్మారి కరోనా వైరస్ విజృoభిస్తున్న తరుణంలో దాతలు, ప్రజలకి ఎంతోకొంత సహాయ పడాలని అన్నారు. అదే ఉద్దేశంతో తాను కూడా మీడియా మిత్రులకు సహాయం అందించాలనే ఉద్దేశ్యం తో నిత్యావసర వస్తువులు అందించినట్లు తెలిపారు.  ప్రజల్లో చాలా అవగాహన రావాలని, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలని, అందరూ ఇళ్ళ లోనే ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కు ధరించాలని అన్నారు. కరోనా వైరస్ అరికట్టాల్సిన భాద్యత అందరికి ఉందని,  అందరూ సహకరించాలని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు న్యూస్ లను అందిస్తూ,  మీడియా మిత్రులు చేస్తున్న సేవ అమోఘం మని,  ప్రభుత్వం నుండి మీడియా మిత్రులకు ఎటువంటి సహాయం అందడం లేదని,  అందుచేత తమ వంతు ఎంతోకొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నట్లు తెలిపారు.  మీడియా మిత్రులు,తమ ప్రాణాలను పణంగా పెట్టి వార్తలు సేకరిస్తున్నారని అటువంటి మీడియా మిత్రులను గౌరవించడం  ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ప్రెస్ క్లబ్ సభ్యులు, వర్కింగ్ జర్నలిస్టులు పాల్గున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...