కన్నా పై ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు అభ్యంతరకరం
బిజెపి నాయకులు చెరువు రామకోటయ్య
విశాఖపట్నం/ పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి సతీశ్ కుమార్
కరోనా సమయంలో ప్రజలు మానసిక ఒత్తిడికి లోనవుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం పరాకాష్టకు చేరిందని బిజెపి నాయకులు చెరువు రామకోటయ్య ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆరోపణలు చేయడం విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఆరోపణలను, విమర్శలను విజయసాయిరెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. కరోనా కట్టడికి ప్రతిపక్షాలు ఇస్తున్న సలహాలను సూచనలను ప్రభుత్వం స్వీకరించాలని .. హేళన చేయడం తగదని సూచించారు.
No comments:
Post a Comment