ఉపాధి కూలీలకు మజ్జిగ, మాస్క్లు, సబ్బులు పంపిణీ
కోరుకొండ, పెన్ పవర్.
కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క్రొవ్విడి సర్రాజు, యువ నాయకులు కంటే వినయ్ తేజ, మాజీ ఎంపీటీసీ సభ్యులు పిట్టా క్రిష్ణ ఆధ్వర్యంలో మాస్క్లు, సబ్బులు, మజ్జిగ పంపిణి చేశారు. ఈ సందర్భంగా క్రొవ్విడి సర్రాజు, కంటే వినయ్ తేజ, పిట్టా కృష్ణ మాట్లాడుతూ నిరంతరం చేతులను సబ్బుతో కడుక్కోవాలని, బయటకు వస్తే మాస్కు తోనే బయటకు రావాలని ఉపాధి కూలీలకు తెలియజేశారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత తో కరోనా వైరస్ ను తరిమికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూరూగుపూడి వైఎస్సార్సీపీ గ్రామ ప్రెసిడెంట్ మేక రాజు, అడపా రామకృష్ణ, చింతల బన్ను, చెరుకూరి సతీష్, చిల్లీ భాను చంద్ర, మొల్లేటి త్రిమూర్తులు, విద్యకమిటీ చైర్మెన్ బత్తుల శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment