గత సంవత్సర కాలంగా అనపర్తి పంచాయతీలో జరుగుతున్న సంఘటనలపై పూర్తి దర్యాప్తు చేయాలని మాజీ శాసనసభ్యులు నల్లమిల్లిరామకృష్ణారెడ్డి అనపర్తి ఎంపీడీవో కి వినతి పత్రం అందజేశారు.
అనపర్తి పెన్ పవర్ : కొవ్వూరి నాగ శ్రీనివాస రెడ్డి
గత రెండు రోజుల క్రితం అనపర్తి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఆఫీస్ కి సంబంధం లేని వ్యక్తులు పంచాయతీ కార్యాలయంలో దాడి చేసుకోవడం పై అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల అభివృద్ధి అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయితీలో పంచాయతీ కి సంబంధం లేని వ్యక్తులు పంచాయతీ కార్యాలయంలో దాడి చేసుకోవడంపై దర్యాప్తు చేయాలని జిల్లా అధికారులని కోరడం జరిగిందని. అలాగే ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేశామని గత సంవత్సర కాలంగా పంచాయతీలో జరుగుతున్న కార్యక్రమాలపై సమాచార హక్కు చట్టం లో సమాచారం అడగడం జరిగిందని ఆయన అన్నారు. పంచాయతీ కార్యాలయంలో దాడి జరగడంపై ప్రజలంతా చాలా రకాలుగా మాట్లాడుతున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రీ శేషరత్నం.
సత్తి దేవానంద్ రెడ్డి. కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి. మామిడిశెట్టిశ్రీను. టిడిపి నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment