Followers

తప్పెవరిది..


 


 


 


 


తప్పెవరిది..


 


చోడవరంలో మద్యం అక్రమ అమ్మకాల కేసులో ట్విస్టు పై అధికారుల తప్పిదమేనంటూ ఫిర్యాదులు 


 


చోడవరం, పెన్ పవర్  ప్రతినిధి మజ్జి శ్రీనివాస మూర్తి 


 


  చోడవరం మద్యం అక్రమ అమ్మకాల కేసులో నిందితులెవరన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిందస్థాయి సిబ్బంది ముగ్గురూ కలిసి అక్రమ విక్రయాలకు పాల్పడ్డారని స్వయంగా ఎక్సైజ్ పోలీసులే తెలిపారు కానీ తమకేమీ తెలియదని, బలవంతంగా తమను లాగుతున్నారంటూ నిందుతులుగా పేర్కొంటున్నవారు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. ఫిర్యాదుదారులు చెప్పిన వివరాల ప్రకారం.. చోడవరం పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ ముఖద్వారం ఎదురుగా ఉన్న మద్యం షాపులో మద్యం అక్రమ అమ్మకాలు జరిగాయని, ఈ కేసులో సూపర్‌వైజర్ బి.కరుణ, సేల్స్ మేన్ మజ్జినాగేంద్రకుమార్, అల్లాడి శివకృష్ణలను నిందితులుగా పేర్కొంటూ.. వారి నుంచి 7.76 లక్షలు రికవరీ చేసినట్టుగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. అయితే ఇది వాస్తవం కాదంటూ మజ్జి నాగేంద్రకుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. అంతేకాదు.. ఆ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాము 2020 మార్చి 21 తేదీన ఎప్పటిలాగే షాపులో పని చేసి దుకాణం మూసివేసిన ఇంటికెళ్లిపోయామని తెలిపారు. మార్చి 22న జనతా ఖర్వ్యూ సందర్భంగా సెలవని, ఆ తర్వాత రోజు నుంచి వరుసగా లాక్ డౌన్ జరుగుతున్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. కానీ ఏప్రిల్ 24న సూపర్‌వైజర్ రమ్మని ఫోన్ చేస్తే వెళ్లామని, వెళ్లిన తర్వాత అప్పటికే 7 లక్షల రూపాయల పైచిలుకు స్టాకు తక్కువగా ఉన్నట్లు తెలిపారన్నారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్న తమను ఎక్సైజ్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఏఈఎస్ లాఠీలతో దారుణాతి దారుణంగా చితకబాదారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంత నగదు వాడుకున్నట్టుగా తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ నిర్బంధించి.. నానా దుర్భాషలాడుతూ.. ఇష్టమొచ్చినొట్టు కొట్టడంతో ప్రాణభయం, దెబ్బలను తట్టుకోలేక వారు పెట్టమన్నచోట సంతకాలు చేసి ఇచ్చాను తప్ప.. తామెలాంటి నగదు వాడుకోలేదని వాపోయారు. తాము ఏది చెబితే అది చేస్తే మీకే మంచిదని.. లేదంటే గంజాయి, నాటు సారా లాంటి మీకు సంబంధం లేని కేసులను రుద్దతామని హెచ్చరించారంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత రోజు నా చేతికి రూ.80 వేలు ఇచ్చి స్టేట్ బేవరేజ్ అకౌంట్ కు డిపాజిట్ చేయించారని వివరించారు. ఎక్సైజ్ సీఐపై ఆరోపణలు ఈ కేసులో ఎక్సైజ్ సీఐపై ప్రధానంగా ఆరోపణలున్నట్టుగా నాగేంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి నెలా ఐదో తేదీన సీఐ వచ్చి ఆడిట్ ను తనికీ చేయాల్సి ఉందని, కానీ ఆరు నెలలుగా సీఐ వచ్చి తనికీ చేసింది లేదన్నారు. అందుకు సంబంధించిన రిజిస్టర్‌ను సీఐ కార్యాలయానికి సూపర్వైజర్ కార్యాలయానికి తీసుకెళ్తే ఆ ఆడిట్ ఫైలుపై సంతకం మాత్రమే చేసేవారని ఆరోపించారు. అలాగే మార్చి 5 వరకూ ఆడిట్ సరిపోయిందని సీఐ సంతకం చేశారని, కానీ 16 రోజుల వ్యవధిలో ఏడు లక్షల పైబడి నగదు ఎలా తేడా వచ్చిందో పరిశీలించాలని నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. దీనిపై సీఐ పైనే అనుమానాలున్నాయంటూ తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...