Followers

దాతల సహకారంతో ఉచిత భోజన ఏర్పాట్లు


 





దాతల సహకారంతో ఉచిత భోజన ఏర్పాట్లు

 

రావులపాలెం, పెన్ పవర్ : కోణాల వెంకటరావు 

 

 

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో  నిరాశ్రయులు,నిరు పేదలు భోజనం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపద్యంలో వారి కష్టాలను గుర్తించిన మండలంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని మారుతీనగర్ యూత్ సభ్యులు ఉచితంగా భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు.  అంకితభావంతో విశేష సేవలందిస్తున్న పలువురు   అభయాంజనేయ స్వామి గుడి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నార్తులను ఆదుకోవడంలో ముందు ఉంటున్నారు. మండలంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 16 రోజుల నుంచి దాతల సహకారంతో నిరుపేదలకు ఆహారం  ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మావంతు సహకారాన్ని అందిస్తామని ఆదివారం దాతలు కర్రి అశోక్ రెడ్డి ఫ్రెండ్స్ , బోయిడి వెంకన్నబాబు ( బద్రి) కుటుంభ సభ్యులు ఆదివారం భోజన  ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వెంకన్నబాబు  మాట్లాడుతూ రహదారి చెంతనే ఉండి భోజన వసతులు లేక ఇబ్బందులు పడే వారి కోసం ప్రతీ రోజు దాతల సహకారంతో  వంటకాలు సిద్ధం చేసి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అవసరం అయిన వారికి నగదు,బియ్యం,నిత్యావసరవస్తువులు  పంపిణీ  చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా  ఆలయంలో బద్రి    కుటుంభ సభ్యులు పూజలు నిర్వహించారు.  ప్రతీరోజు అన్నదానం చేసే దాతలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కంబాల సూరిబాబు, సాధనాల శ్రీను, బోయిడి సతీష్,దాలిశెట్టి నాయనరావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...