మానవత్వం పరిమళించిన గొప్ప మనసున్న ఎస్సై మధుకర్ రెడ్డి
అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం చేసిన ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి
కరీంనగర్/ చిగురుమామిడి (పెన్ పవర్ న్యూస్)
ఖాకీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కరుకు మాట కానీ ఆ కరకు మాట వెనకాల చలించే గొప్ప మానవతావాది ఉంటారని నిరుపించారు.. చిగురుమామిడి సబ్ ఇన్స్ స్పెక్టర్ చల్ల మధుకర్ రెడ్డి లాక్ డౌన్ నేపధ్యం లో తీరిక లేకుండా ఒక వైపు డ్యూటీ చేస్తూ..మరొక వైపు అనాధ పిల్లలకు ఆపన్న హస్తం అందించి పోలీస్ అంటే ఇదీ అనీ చాటి చెప్పాడు. వివరాల్లోకివెళితేచిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మంద సదానందం డెంగ్యూ జ్వరంతో గత నాలుగు నెలల క్రితం చనిపోయినాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకే భార్య స్వప్న కిడ్నీలు పాడైపోయి ఇటీవలే మరణించడంతో...తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలు, ఐదు సంవత్సరాల బాబు అనాధలయ్యారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న మండలంలోని చాలా మంది ఆర్థిక సహాయం చేస్తూ... అనాధ పిల్లలకు అండగా నిలబడుతున్నారు. బుధవారం రోజున చిగురుమామిడి మండల ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి అనాధ పిల్లలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా సీఆర్పిఎఫ్ జవాన్ బవండ్లపల్లి అజయ్ వెయ్యి రూపాయల అర్థిక సహాయం అందించారు. మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్ అనాధ పిల్లలకు అందించారు. అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన ఎస్సై కి గ్రామ సర్పంచ్ సన్నీల వెంకటేశం కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment