Followers

నెల్లూరు జిల్లాలో కోరలు చాచిన కరోనా 


నెల్లూరు జిల్లాలో కోరలు చాచిన కరోనా 


తాజాగా 17 పాజిటివ్ కేసులు నమోదు 


    నెల్లూరు, పెన్ పవర్                                 


నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇవాళ విడుదల చేసిన కరోనా పరీక్షల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి 17 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ 17 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20 కి చేరింది. 20 కేసుల్లో ఇటలీ నుండి వచ్చిన నెల్లూరు యువకుడు వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మిగిలిన 19 మంది నెల్లూరు జీజీహెచ్ లోని ఐసోలేషన్ వార్డు లో చికిత్స పొందుతున్నారు. నిన్న వెలుగు చూసిన రెండు కేసులతో పాటూ తాజాగా వెలుగు చూసిన 17 కేసులకు సంబంధీన వారంతా డిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. 


ఇవాళ కేసులకు సంబంధించి నెల్లూరు నగరానికి చెందిన 10 మంది, నాయుడుపేటలో ముగ్గురు, కావలి లో ఇద్దరు, బుచ్చి, ఇందుకూరుపేట లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడ్డారు. మరో వైపు ఒకే రోజు 17 కేసులు వెలుగు చూడటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వేకు కలెక్టర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నివాసం ఉండే ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే రెండు డివిజన్లలో రెడ్ అలెర్ట్ ప్రకటించిన అధికారులు, మిగిలిన ప్రాంతాల్లో కూడా రెడ్ అలెర్ట్ ప్రకటించనున్నారు. పాజిటివ్ కేసుల బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అనే విషయాలపై ఆరా తీసే వారిని క్వారయింటెన్ సెంటర్లకు తరలిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఇంకా 213 మంది రిపోర్టులు రావల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...