Followers

రబీ దాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు,


రబీ దాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు,


వాటిని పొందేందుకు నిర్థేశించిన నాణ్యతా ప్రమాణాల గురించి రైతులందరికీ సమగ్ర అవహగాన కల్పించాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ పిపిసి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.


 


కాకినాడ, పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ : చినబాబు


          సోమవారం మద్యాహ్నం జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ సామర్లకోట మండలంలోని మేడపాడు, ఏడిబి రోడ్ లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా  పిపిసి కేంద్రాలలోని నాణ్యతా ప్రమాణాల నిర్థారణ యంత్రాలు, తూకాలు, ధాన్యం నిల్వ చేసే సదుపాయాలు, మద్దతు ధరలు, నాణ్యతా ప్రమాణాల సమాచారం బోర్డుల ప్రదర్శన రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. మేడపాడు  పిపిసి కేంద్రానికి వచ్చిన రైతులను ఆయన ఆత్మీయంగా పలకరించి, ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల గురించి తెలుసునా? అని వాకబు చేసారు.  ధరల గురించి తమకేమి తెలియదని, చదువు కోనందున బోర్డులపై వ్రాసినదేమిటో తమకు అర్థకాలేదని ఒక రైతు తెలియజేశాడు.   రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో పిపిసి కేంద్రం నిర్వాహక ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుల నుండి కొనే ధాన్యానికి ఏఏ రకానికి ఎంత మద్దతు ధర చెల్లిస్తారు, రైతులు తమ ధాన్యానికి మంచి ధర వచ్చేందుకు పాటించ వలసిన తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలు గురించి ప్రతి రైతుకు సమగ్రంగా వివరించాలని ఆయన పిపిసి కేంద్రం ఏజెన్సీలను ఆదేశించారు.  రైతుల పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని,  దళారులకు తక్కవ ధరకు అమ్మి నష్ట పోవద్దని ఆయన రైతులను కోరారు. ఈ పర్యటనలో ఆయన వెంట సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డియం జయరాములు, పౌర సరఫరాల సంస్థ క్షేత్రాధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...