Followers

కరోనా కట్టడికి పూర్తి సన్నద్ధం



    కరోనా కట్టడికి పూర్తి సన్నద్ధం



       విశాఖ నుండి రక పోకల్ని కట్టుదిట్టం చేసాం
     వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్


 


బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్


  జిల్లాలో కరోనా  నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు .  ఆదివారం ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య  కార్యదర్శి డా. జవహర్ రెడ్డి  కరోనా ఏర్పాట్ల పై, ప్రస్తుత పరిస్థితుల పై జిల్లా కల్లెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో  కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి  జిల్లా లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా  మార్చి అన్ని వసతులను ఏర్పాటు చేసి,  వైద్యులను, పారా  మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.  జిల్లాలో 22 వెంటిలేటర్లను 66 ఐ.సి.యు, 959 నాన్ ఐ.సి.యు బెడ్స్ ను,  సిద్ధం చేయడం జరిగిందన్నారు. 382 మంది వైద్యుల్ని, 1186 మంది నర్స్ లను,పారా మెడికల్ సిబ్బందిని  నియమించడం  జరిగిందని తెలిపారు.    కరోనా ట్రీట్మెంట్  కోసం ప్రబ్బుత్వ ఆసుపత్రులతో పాటు  నాలుగు ప్రైవేటు  ఆసుపత్రులను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  జిల్లాలో 4507 బెడ్స్ కెపాసిటీ తో  32 క్వరెంటైన్  కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జే.ఎన్.టి.యు  లో ప్రస్తుతం 120 మంది క్వరెంటైన్   లో ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల నుండి నమూనాలను సేకరిస్తున్నామని,  జిల్లా నుండి ఇప్పటి వరకు కరోనా పరీక్షల కోసం 306 నమూనాలు పంపగా 216 నెగటివ్  వచ్చాయని  ఇంకను 90  పరీక్షల ఫలితం రావలసి ఉందని పేర్కొన్నారు.   అయతే విశాఖపట్నం నుండి వ్యాధి నిర్ధారిత పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని, కాకినాడ పంపడానికి అవకాసం కల్పిస్తే త్వరగా ఫలితాలు వచ్చే వీలుంటుందని కలెక్టర్ కోరగా, విశాఖ పట్నంలోనే  అదనపు వనరులను సమకూర్చడం ద్వారా త్వరగా వచ్చేలా చూడడం జరుగుతుందని డా.జవహర్ రెడ్డి గారు తెలిపారు.
విశాఖ  నుండి వచ్చే రహదారులన్నీ మూసివేత :
        విశాఖపట్నంలో పాజిటివ్ కేసు లున్నందున, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకుండా  జిల్లా సరిహదుల్లో  ఉన్న రహదారులన్నిటిని మూసి వేయడం జరిగిందని  కలెక్టర్ తెలిపారు.   ప్రధాన మార్గాల వద్దే కాకుండా  లింక్ రోడ్ల వద్ద  కూడా చెక్ పోస్ట్ లను పెట్టి నిఘా పెంచడం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో  ఉన్నతాధికారుల అనుమతి తోనే  ఎవరైనా కదిలేలా కట్టుదిట్ట మైన ఏర్పాట్లను చేశామన్నారు.
 కరోనా నియంత్రణ సామాగ్రి సిద్ధం:
   వైద్యుల కోసం 667 పి పి ఎక్విప్మెంట్ ను, 1600 ఎన్-95 మాస్క్లను, 31,425  గ్లోవ్స్  ను, 69 వేల  సర్జికల్ మాస్క్ లను , 9 వేల లీటర్ల సానిటైసర్  తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచమని, స్టాక్ రిజిస్టర్ ద్వార వినియోగించిన, వచ్చిన వాటి వివరాలను నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు.
          ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ జి.సి.కిశోర్  కుమార్,  సహాయ కలెక్టర్ కేతన్ గార్గ్ , జే.సి-2 కుర్మనాద్,  జిల్లా రెవిన్యూ అధికారి వెంకట రావు, జిల్లా  వైద్య అధికారి డా. రమణ కుమారి, ఆసుపత్రుల సమన్వధికారి డా. నాగభూషణ రావు, సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...