రైతుల డేటాను డి-కృషి యాప్ లో పొందుపరచాలి
రైతు భరోసా కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్
విజయనగరం , పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధి లోనున్న రైతుల డేటా మొత్తం డి-కృషి యాప్ లో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ ఖరిఫ్ 2020 లో వేరుసెనగ , వరి పండించే రైతుల వివరాలను వెంటనే సేకరింఛి డి-కృషి యాప్ లో పొందుపరచాలన్నారు. నిత్యావసర సరుకుల మార్కెట్ స్థానిక ధరలను గ్రామ వ్యవసాయ సహాయకులు(అగ్రికల్చర్ అసిస్టెంట్), ఉద్యాన శాఖ సహాయకులు (హార్టికల్చర్ అసిస్టెంట్) లు ప్రతి రోజు ఉదయం 11 గంటల లోపు ఎస్సెన్సియల్ కమోడిటీస్ యాప్ ద్వారా పంపాలన్నారు. జిల్లాలో గత ఏడాది రైతు భరోసా క్రింద 2 లక్షల 71 మంది కి సహాయాన్ని అందించాలని ఎంపిక చేయగా 27 వేల 500 మందికి వేర్వేరు కారణాల రీత్యా ఆర్ధిక సహాయం వారి అకౌంట్స్ లో జమ కాలేదని అన్నారు. అయితే వారికి ప్రభుత్వం ప్రస్తుతం ఎడిట్ చేసే అవకాశం కల్పించిందని, వ్యవసాయ, పంచాయతి రాజ్, రెవిన్యూ, బ్యాంకర్స్ తో టై అప్ చేసుకొని ఏ కారణంగా లబ్ది పొందలేదో గుర్తించి లబ్ది దారులందరికి జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో మంజూరు చేసిన 664 రైతు భరోసా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి విడత లో చేపట్టిన 170 పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని రెండు విడతల్లో పూర్తి చెయ్యాలని అన్నారు. ఈ నెల 30 లోగా రెండవ విడతలో చేపట్టిన 170 రైతు భరోసా కేంద్రాలకు పెయింటింగ్ పూర్తి చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖా సంయుక్త సంచాలకులు ఆశా దేవి తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ డి డిలు, ఎ.డి లు, మార్కెటింగ్ శాఖ ఎ.డి శ్యాం కుమార్ , వ్యవసాయాధికారులు , గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment