Followers

ముత్యం లాంటి మనసున్న నాయకులు ముత్యాల ధంపతులు


ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసున్న నాయకులు ముత్యాల ధoపతులు

 

            పరవాడ, పెన్ పవర్

పరవాడ మండలం: కరోనా వైరస్ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముత్యాలమ్మ పాలెం గ్రామస్థులకు    మేము మీకు అండగా ఉన్నామంటూ టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ చింతకాయల సుజాత ముత్యాలు దంపతులు.కరోనా కారణంగా ప్రభుత్వం స్వీయ నిర్బంధం(లాక్ డవున్)విధించి నెల రోజులు దాటినది రోజు కష్టపడితే కానీ పూటగడవని కష్టజీవులు నెల నుంచి ఇళ్లలో కూర్చుని వుండటం వలన ఎటువంటి రాబడి లేక ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడు తున్నారు.మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు మత్యకార సోదరులకు చేపల వేటకుకూడ ప్రభుత్వం విరామం ప్రకటించడం తో కష్టాలు దిగుణీకృతం అయ్యాయి.ఇటువంటి పరిస్తుల్లో మీకు మేము ఉన్నాము అంటూ ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ వాసులకు కు భరోసా కల్పిస్తున్నారు ముత్యాల దంపతులు.గత కొంతకాలంగా ముత్యాలమ్మ పాలెం గ్రామంలో త్రాగు నీటి సమస్య మొదలు అయితే ప్రతినెలా 2లక్ష రూ వెచ్చించి అపర భగీరథుడుల ట్యాకర్ తో రోజూ మంచినీటిని సరఫరా చేస్తున్న నాయకుడు ముత్యాలు.ఇప్పుడు గ్రామస్థులు తిండి గింజలకు ఇబ్బంది పడుతున్నారు అని ఎరిగిన ముత్యాలు పది కేజీల బియ్యాన్ని 1500 మత్స్యకార కుటుంబాలకు రు"8 లక్షలు తమ సొంత నిధులను వెచ్చించి ఉచితంగా అందజేస్తున్నారు టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు చింతకాయలముత్యాలు.అసలే వేసవి కాలం, ఆపైన కరోనా మహమ్మారి, దీనికితోడు నీటి ఎద్దడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న గ్రామస్తులకు ఉచిత తాగునీటి సరఫరా ఊరట కలిగించింది. తమ తాగునీటి కష్టాలు , నిత్య అవసరాల సమస్య ని    తీరుస్తున్న ముత్యాల కుటుంభం మీద గ్రామస్థులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతి కుటుంబానికి పది కేజీల బియ్యం సమకూర్చి తమ కుటుంబాన్ని ఇంతకాలం రాజకీయంగా ఆదరించిన    గ్రామపంచాయతీ వాసులకు కృతజ్ఞతతో కష్ట కాలంలో ఉన్న గ్రామ ప్రజలకు తన వంతు భాద్యతతో చిరు సహాయం అందిస్తున్నామని సుజాత ముత్యాలు దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ముత్యాల దంపతులు చేస్తున్న సామాజిక సేవ పట్ల పంచాయతీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ పంపిణీ కార్యక్రమంలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులు మైలపల్లి ధనలక్ష్మి, సూరాడ ఎర్రయ్య,మాజీ ఎంపీటీసీ సభ్యులు చింతకాయల అమ్మోరు, స్థానిక టిడిపి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...