ప్రభుత్వ డాక్టర్ ఆరోపణల వెనుక మాజీ మంత్రి అయ్యన్న హస్తం
నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం, పెన్ పవర్
కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, అధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ ని ఒక పావుల వాడుకున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి ముందు ప్రభుత్వ డాక్టర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి దాదాపు గంటన్నరసేపు ఆయనతో మంతనాలు సాగించారని ఆయన చెప్పిన స్క్రిప్టు ప్రకారం డాక్టర్ సుధాకర్ తన పాత్ర పోషించారని తెలిపారు. దానికి ఉదాహరణగా అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద పార్కింగ్ ప్లేస్ లో డాక్టర్ సుధాకర్ కారు దిగి మరల కారు ఎక్కి వెళుతున్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పాత్రికేయులకు చూపించారు. ఏరియా ఆసుపత్రిలో మాస్క్లులు, శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డాక్టర్ తీరుపై ప్రభుత్వానికి చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగిందని, ఈ డాక్టర్ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లేఖ రాసినట్లు చెప్పారు.
No comments:
Post a Comment