ముస్లింలకు అతి ముఖ్యమైన పండుగ రంజాన్.
కోవిడ్ 19 వల్ల ఇళ్ళల్లో వేడుక లు జరుపుకోవాలి.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 కారణంగా ముస్లింలు రంజాన్ పండుగను ఇళ్లవద్దనే ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం మంత్రి ఎంపి లు, జిల్లా కలెక్టరు, ఎస్ పిలతో కలసి ముస్లిం మత పెద్దలతో పవిత్ర రంజాన్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై వుడా చిల్డ్రన్ ఎరినాలో సూవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ అతి ముఖ్యమైన పండుగని, వారు బందుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటారని, అయితే కోవిడ్–19 ప్రమాదము ఉన్నందున వారు పండుగను కొన్ని పరిమితులకులోబడి నిర్వహించుకోవలసి రావడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం అభివృద్దికి, సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పండుగతో పాటు ప్రజలను కాపాడుకోవాలన్నారు. యిప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్, ముస్లిం మత పెద్దలతో ఈ విషయాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారన్నారు. ఎం పి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వీలైనంత వరకు ఇంటికే పరిమితమై రంజాన్ పండుగను జరుపుక్పోవాలని సూచించారు. విశాఖపట్నంలో సుమారు 25వేల మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయని వారందరికి ప్రగతి భారతి ట్రస్టు ద్వారా నిత్యావసర సరకులు కిట్ లను అందజేస్తామన్నారు. మత పరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ప్రత్యేక ఆర్ధిక సహాయం క్రింద 5 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ కోవిడ్–19 సందర్భంగా ముస్లింలు రంజాన్ పండుగను ఇళ్ల వద్దనే జరుపుకోవాలని సూచించారు. మీ అందరికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. అందరి సూచనలతో రాష్ట్ర స్థాయిలో మార్గదర్శకాలు వస్తాయన్నారు.
ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు రెహమాన్, పలువురు మత పెద్దలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. విశాఖపట్నం శాంతకాముక జిల్లా అని, అందరు సంమయనం పాటిస్తూ, పవిత్ర రంజాన్ మాసం నిష్టతో ఉపవాసం చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిగారి సూచనలు పాటిస్తూ సమాజాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వి ఎం ఆర్ డి ఎ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎస్ పి అట్టాడ బాబూజీ, మత పెద్దలు ఐ.హెచ్. ఫరూఖ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment