మెప్మా ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ ప్రారంభం
- మెప్మా ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
- పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలచే తయారు చేయబడిన మాస్కులు.
- రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మూడు మస్కులను అందించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.
- కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపీ గౌతమ్ సవాంగ్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్. నవీన్ కుమార్, ఐఏఎస్, ఆదనపు మిషన్ డైరెక్టర్ శ్రీ కె. శివ పార్వతి.
- అనంతరం రాష్ట్రంలోని మాంసవిక్రయదారులకి మస్కులను పంపిణీ చేసిన మెప్మా అధికారులు మరియు సిబ్బంది.
- 100 క్లస్టర్లలోని 34 ఉత్పత్తి కేంద్రాలలో మాస్కుల తయారీ లో నిమగ్నమైన 13000 పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలు.
స్టేట్ బ్యూరో చింతా వెంకటరెడ్డి, పెన్ పవర్ అమరావతి:
కరోన మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా మరియు ఈ సంక్లిష్ట పరిస్థితిలో పేదవారికి అండగా నిలిచేలా ప్రణాళికా బద్ధమైన చర్యలను తీసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో కరోన విజృంభన నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి మూడు మాస్కుల చొప్పున్న అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోన పై చేస్తున్న పోరాటంలో ఒకవైపు నివారణ చర్యలు చేపడుతూ మరోవైపు వార్డ్ స్థాయిలో ప్రతి ఒక్కరికి కరోన నివారణ నియమలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘ మహిళకు జీవనోపాధి కల్పించేలా ఈ మాస్కుల తయారీ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇందుకు గాను మెప్మా ఆధ్వర్యంలో 100 క్లస్టర్ లలో ఏర్పాటు చేసిన 34 ఉత్పత్తి కేంద్రాల ద్వారా 13000 మంది స్వయం సహాయక సంఘ మహిళలు రోజుకి లక్ష మాస్కుల తయారీ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్నీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఈ సందర్బంగా స్వయం సహాయక సంఘ మహిళల స్ఫూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్. నవీన్ కుమార్, ఐఏఎస్, ఆదనపు మిషన్ డైరెక్టర్ శ్రీ కె. శివ పార్వతి పాల్గొన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వార్డ్ స్థాయిలో ఉన్న మాంసవిక్రయ మార్కెట్లోని మాంసవిక్రయదారులకి, చేపల విక్రయదారులకి, కొనుగోలుదారులకి స్వయం సహాయక సంఘ మహిళచే తయారు చేయబడిన మాస్కులను మెప్మా ప్రాజెక్ట్ అధికారులు మరియు సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోన నుంచి రక్షణ కల్పించే ఈ మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ స్పూర్తిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసారు మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్.నవీన్ కుమార్,ఐఏఎస్. అలాగే మెప్మా ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, కమీషనర్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నామని తెలియజేసారు.
No comments:
Post a Comment