రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
- రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
కోరుకొండ, పెన్ పవర్
కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం కోరుకొండ పీఏసీఎస్ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు వెసులుబాటు కల్గించే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
కోరుకొండ గ్రామపంచాయతీ ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే నూతన విద్యుత్ మోటార్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల శెట్టి సత్యనారాయణ, కోరుకొండ మండల వైసిపి కన్వీనర్ ఉల్లి బుజ్జి బాబు, కోరుకొండ సొసైటీ చైర్మన్ అరుబోలు రామలింగేశ్వరరావు (చినబాబు), కోరుకొండ సొసైటీ కార్యదర్శి జి వి ఎస్ వర్మ, సొసైటీ మెంబర్స్ ఉల్లి శేషగిరిరావు, అడబాల గొల్ల బాబు, కోరుకొండ వ్యవసాయ శాఖ ఏడిఏ బి కే మల్లికార్జున రావు, కోరుకొండ వ్యవసాయ శాఖ అధికారి గౌరీదేవి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment