కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి
ఎంపీ విజయసాయిరెడ్డి.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
కరోనా వైరస్ నిర్మూలనకు నగర ప్రజలు సహకరించాలని ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సోమవారం బుచ్చి రాజుపాలెం లో ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నగరంలో పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం కరోనా పై కఠినమైన చర్యలు చేపట్టిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రజలు సామాజిక భద్రత వ్యక్తిగత దూరం పాటించాలని కోరారు. అవసరాల నిమిత్తం వెసలుబాటు కల్పించిన సమయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అందువల్ల వైరస్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా జిల్లాలో పాజిటివ్ కేసులు 20కి చేరుకున్నాయని వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. కరోనా వైరస్ పరీక్ష కేంద్రాన్ని కేజీహెచ్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రగతి సెక్స్ భారతి పౌండేషన్ తరఫున పారిశుద్ధ్య కార్మికులు ఇతర వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అరబిందో ఫార్మసీ 10 వేల లీటర్లు ఫార్మా కంపెనీ 2000 లెటర్లు హ్యాండ్ వాషర్స ఇచ్చారని హ్యాండ్ వాషర్స్ ని పారిశుధ్య కార్మికులు సిబ్బందికి అందజేస్తామన్నారు. ప్రగతి భారతి పౌండేషన్ సేవలను విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు విస్తరిస్తామని విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ ప్రగతి భారతి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment