Followers

విశాఖ ఏజెన్సీలో మాటలకే పరిమితం అయిన గ్యాస్ హోమ్ డెలివరీ


విశాఖ ఏజెన్సీలో మాటలకే పరిమితం అయిన గ్యాస్ హోమ్ డెలివరీ....


పాడేరు (పెన్ పవర్)


 


విశాఖ జిల్లా.పాడేరులో కరోనా.ప్రభావంతో ప్రతి ఇంటికి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు అమలు విషయంలో చోద్యం చూస్తున్నారు. ఐటిడిఎ గ్యాస్ సిబ్బంది ఇదే అవకాశంగా చేసుకొని గ్యాస్ బండ 800 రూపాయలుగా అంగట్లో అమ్ముకుంటున్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో 11 మండలాలో ప్రతి ఒక్క పౌరుడు బయటకు రావద్దని... అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రతి ఇంటికి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తామని గతంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డి.కె.బాలాజీ ప్రకటన రూపంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు గ్యాస్ సరఫరా కాదు కదా ఆ ప్రస్తావనే లేదు. ఏజెన్సీ ప్రాంతంలో పాలు నీళ్లు కూరగాయలు గ్యాస్ నిత్యవసర సరుకులు ప్రతి పేదవాడికి ఇంటికి చేరాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి గ్యాస్ డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఏజెన్సీ వాసులు వినియోగదారులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రకటనలు హామీలు తప్ప అమలు చేయటం లేదని పాడేరు ప్రజలు అంటున్నారు. పాడేరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం6 గంటలు నుండి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే డెలివరీ ఛార్జ్ పేరుతో 30 రూపాయలు అదనంగా వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా 800 రూపాయలు ముక్కుపిండి నిర్భయంగా వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసే ఈవిధంగా జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...