Followers

కరోనా సాయం, నియంత్రణలో  సక్సెస్ 


కరోనా సాయం, నియంత్రణలో  సక్సెస్ 

 

-- విస్తృత సేవల్లో అనకాపల్లి వైసిపి నాయకులు  

 

-- ఎమ్మెల్యే సహా పలువురి ప్రశంసలు 

 

అనకాపల్లి , పెన్ పవర్  

 

అనకాపల్లిలో కరోనా  సాయం నియంత్రణ అంశాల్లో వైసిపి నాయకులు ముందంజలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. కరోనా  నేపథ్యంలో విదించిన లాక్డౌన్ అమలులో వైసీపీ నాయకుల  పాత్రను కొట్టిపారేయలేం. ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత జగన్మోహన్  రెడ్డి  ఇచ్చిన పిలుపును ఎమ్మెల్యే అమరనాథ్ ఆదేశాలను పక్కాగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.  అనకాపల్లిలో  ఇప్పటి వరకు కరోనా సమస్య కూడా తలెత్తకపోవడం దీనికి అదనపు బలంగా చెప్పుకోవచ్చు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందనెది అందరికీ తెలిసిందే. ఇటు రాష్ట్రం జిల్లాల్లో  సమస్య అక్కడక్కడ ఆందోళనకు గురి చేసేలా చేస్తుంది.  అనకాపల్లిలో అలాంటి ప్రభావం కానరాకపోవడం చెప్పుకోదగినదిగా కొందరు కితాబిస్తున్నారు. వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలుచేయడంలో పోలీసులదే కీలకపాత్ర. అటు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు  చేస్తున్న సేవలు వర్ణనాతీతం.  ఎవరెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అనుకున్న ఫలితం కనిపించకపోతే అటు ప్రభుత్వం పార్టీపైనే ముద్ర పడుతుందన్నది వాస్తవం. దీనిలో  భాగంగానే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ పార్టీ నేతలకు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

        అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్యే అమర్నాథ్ ఇచ్చిన ఆదేశాలను  క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో వైసిపి నేతలు సఫలమయ్యారనే చెప్పొచ్చు. రెేషన్ డిపోల వద్ద లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సొంత నిధులతో సౌకర్యాలను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ప్రధానంగా సామాజిక దూరాన్ని పాటించేలా ప్రజల్లోనే ఉంటూ అవగాహన కల్పించడం చెప్పుకోదగినది. పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఆదుకోవడంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.   ఆహారం కాయగూరలు వంటివి పంపిణీ చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ కు మంచి పేరు తీసుకొస్తున్నారు. పట్టణ అధ్యక్షులుగా మందపాటి జానకిరామరాజు చేస్తున్న సేవలు ఎక్కువే. అటు పలకా రవి, జాజుల రమేష్ ,కాండ్రేగుల భాస్కర్,  పీలా  రాంబాబులు, గొర్లె సూరిబాబు  తమతమ స్థాయిలో పేదలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. వీరికి తోడు అనేకమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులు  విస్తృత సేవలు అందిస్తుండటంతో ఇప్పటికైతే కరోనా సమస్య ఇక్కడ కానరాకపోవడం గమనార్హం. 
 

 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...