ప్రభుత్వం సూచించిన సామాజిక దూరాన్ని పాటించి కరోనా వ్యాధిని తరిమికొట్టాలని వైకాపా 80 వ వార్డు ఇంచార్జ్ నాయకులు కొణతాల భాస్కరరావు కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో లో పేదలకు ఆదివారం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ , ఎం.పి భీశెట్టి సత్యవతమ్మ , దాడి వీరభద్రరావు ,పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ ,జయవీర్ సూచనల మేరకు కార్యక్రమాన్నిి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ విలీన గ్రామాలు పెదతాడి, చినతాడి గ్రామ ప్రజలు ప్రస్తుతం వున్నా పరిణామం వలన ఎవరు పనులకు వెళ్లకుండా అందరు ఇళ్లకు పరిమితమై ఉండటం వల్ల ఆర్థికంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి తన వంతు సేవ చెయ్యాలని ప్రతి ఇంటికి నిత్యావసరాలైన కాయగూరలను పంచారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పారు. లాక్ డౌన్ కి స్వచ్చందంగా సహకరిస్తున్నందుకు గ్రామ ప్రజలందిరికి కృతజ్ఞతలు చెప్పారు. సమిష్టి కృషితో ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కరోనాని ప్రతి ఒక్కరూ యుద్ధంలా భావించి విజయం సాధించాలని కోరారు. కార్యక్రమంలో కె.ఎమ్.నాయుడు, కోరిబిల్లి పరి,కోరిబిల్లి ఆరుద్ర, కాండ్రేగుల శ్రీరామ్,కర్రి అప్పాజీ,విల్లూరి సంతోష్, పెంటకోట దామోదర్,పెంటకోట సునీల్,పిల్లా నాగేశ్వరరావు, బంతికోరు గోవింద్, శీలం నదియా,కోమటి సూరిబాబు, గొన్న వెంకటరమణ, శీలం సూరిబాబు, పితాని నీలకంఠరావు, గనిరెడ్డి కనకరాజు, ముమ్మన అప్పారావు, ముమ్మన పోతురాజు, జుత్తుకు రాము, గొలగాని గోవింద్ మరియు పెదతాడి, చినతాడి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment