Followers

పంచాయతీ లో నిత్యావసర వస్తువుల వితరణ



భరిణికం పంచాయతీ లో నిత్యావసర వస్తువుల వితరణ



             పరవాడ, పెన్ పవర్



పరవాడ మండలం లోని భరణికం గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాల్లో జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ వియ్యపు చిన్నా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల వితరణ చేశారు.బరణికం, బాపడు పాలెం,ఎస్సి కాలనీ,కట్టవాని పాలెం గ్రామాల్లో లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వియ్యపు చిన్నా,బోండా తాతారావు,దాట్ల బంగారు మణి వీరి అందరి వ్యక్తి గత నిధులతో గ్రామం లోని 600 కుటుంబాలకు కేజీ ఉల్లిపాయలు,కేజీ బంగాళాదుంపలు,అర లీటర్ నూనె పేకెట్,6 గ్రుడ్లు లను పంపిణీ చేశారు.కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం స్వీయ నిర్బంధ ఆక్షలు విధించిన తరుణం లో ప్రజలు గత 15 రోజులుగా గృహ నిర్బంధంలో వుంటూ రోజువారీ ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజల ఆర్ధిక ఇబ్బందులను గమనించి వారిని ఆదుకోవాలి అనే సామాజిక స్పృహతో నిత్యావసర వస్తులకు ప్రభుత్వం కల్పించిన నిర్ణిత సమయం వెసులుబాటు కు ప్రజలు అధిక సంఖ్యలో వెళుతుడటం తో స్థానిక నాయకులు సాధ్యమైనంత వరకు ప్రజలను ఇళ్లలోనే ఉంచాలి అని సదుద్దేశం తో చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి గ్రామస్థులు అభినoదిస్తున్నారు.నాయకులు ప్రతింటికి వెళ్లి నిత్యావసర వస్తువుల తోపాటు ప్రతి వక్కరు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రతి వక్కరు బహుతిక దూరం పాటించాలి అని ఇళ్లనుండి బయటకు రావద్దు అని అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ మనమందరం కరోనాని రాష్ట్ర నుంచి దేశం నుంచి ప్రాలదొరడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వానికి,పోలీసులకు,ఆరోగ్య సిబ్బందికి,పారిశుధ్య కార్మికులు సహకరిద్దాము అని కోరారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు బోండా సన్ని దేముడు,జనసేన నాయకుడు మాజీ ఎంపిటిసి మోటూరు సన్యాసినాయుడు,మాజీ ఎంపిటిసి సారిపల్లి జోవినాయుడు,దాట్ల గణేష్ రాజు,పెట్టిశెట్టి సత్యారావు,గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు వడిసిల పైడి రాజు(రాఖీ)ఇందల వరలక్ష్మి,దొడ్డి పైడి రాజు,మంగాల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...