ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి. కనగరాజ్
విజయవాడ లో బాధ్యతల స్వీకరణ
స్టేట్ బ్యూరో చింతా వెంకట రెడ్డి, అమరావతి, పెన్ పవర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగ రాజు నియమితులయ్యారు.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడేంఫుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఫినెన్సు ద్వారా నూతన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా విశ్రాంత జస్టిస్ వి.కనగరాజ్ ని నియమించింది. రాష్ట్రం లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానితో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రసమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు.ప్రభుత్వానికి రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమీషనర్ కి మధ్య అనంతరం చోటు చేసుకుంది.నామినేషన్ ప్రక్రియ ముగిసి ఎన్నికలకు సిద్ధమయ్యే దశలో ఎస్.ఇ. సి నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వం తో సంప్రదించక పోగా స్వయం నిర్ణయాధికారాలు ఉన్నాయని విశేష అధికారాన్ని ఉపయోగించి కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీదుకున్నారు.దానితో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చర్యని సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కోర్టు తలుపు తట్టారు.అనంతర పరిణామాలు అనేక మార్పులకు దారితీశాయి.కోర్టు ఆదేశాలతో ఆయన కొనసాగుతుండగా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చర్యలు చేపట్టింది.ఇంతవరకు ఐ దు సంవత్సరాలు ఉన్న పడవీకాలాన్ని మూడు సంవత్సరాలకి కుదిస్తూ గవర్నర్ ద్వారా ఆర్డినెస్ తెచ్చింది.దీని ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం మూడు సంవత్సరాలు ముగియడం తో ఆయనకి ఉద్వాసన చెప్పి ప్రభుత్వం ఆయన స్తానం లో నూతన ఎస్.ఇ. సి గా విశ్రాంత జస్టిస్ వి.కనగరాజ్ ని నియమించింది .దానితో శనివారం జస్టిస్ కనగరాజ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.కనగరాజ్ చెన్నయ్ లో జస్టిస్ గా విధులు నిర్వహించి పడవీవీరస్మన చేశారు.
ఇదిలా ఉండగా వివాదాస్పద ఎస్.ఇ. సి గా ఉన్న నిమ్మగడ్డ రసమేష్ తాజా సంఘటన ,పరిణామాల పై కోర్టు మెట్లెక్కేందుకు సిద్జం అవుతున్నారు అనే సుమాచారం చర్చ నీయాంశం అయింది .రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను వైఎస్సార్ పార్టీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు,మేధావులు వ్యతిరేకిస్తున్నాయి.ప్రభుత్వం గవర్నర్ ద్వారా తెచ్చిన ఆర్ఫినెన్సు కెవలం భవిష్యత్ నియామకాలకు వర్తిస్తుందని ఇది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్.సి.ఇ కి వర్తించదని పలువురు అభిప్రాయ పడుచున్నారు.ప్రభుత్వ చర్యకి వ్యతిరేకంగా వ్యక్తిగతం గా నిమ్మగడ్డ రమేష్,కాంగ్రెస్,తెలుగు దేశం పార్టీలు కోర్టు తలుపులు తట్టనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.బిజెపి రాష్ట్ర పరిణామాలు,ఎడ్.ఇ. సి తొలగింపు నియామకం,గవర్నర్ ఆర్డినెన్స్ ని పునః సమీక్షించాలని విన్నపాలు చేస్తుంది.
No comments:
Post a Comment