లాక్ డౌన్ నేపథ్యంలో "పేదల సంఘం-పేదల కోసం"వారి సేవలు....
గోకవరం పెన్ పవర్
విపత్కర పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్న పేదలు, యాచకులు,వలసకూలీలు నిర్భాగ్యులుగా,ఆదరణ లేని వారిగా తీవ్ర మనోవేదతో ఎంతో కష్టంగా కాలం వెళ్లబుచ్చుతున్నారు.అలాంటి అభాగ్యులకోసం మేమున్నాం అంటూ కదిలింది "పేదల సంఘం-పేదల కోసం" సైన్యం.నిర్విరామంగా కొనసాగుతున్న వీరి సేవలు ఎంతో మంది కడుపు నింపుతూ,ఆదరణ ఇస్తూ, మరెందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాయి. నేడు జరిగిన కార్యక్రమంలో పలువురు పేదలకు బియ్యం,కిరాణా పంచారు."పేదల సంఘం-పేదల కోసం"ఆధ్వర్యంలో పిరాట్ల.నానాజీ ఆర్ధిక సహాయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వరసాల.ప్రసాద్,సెక్రటరీ కంచర్ల.సూర్యప్రకాష్,సంఘ గౌరవ అధ్యక్షులు కర్రి.సూరారెడ్డి,సంఘ ప్రోత్సాహకులు మంగరౌతు.శ్రీను,దాసరి.రమేష్,ఉపాధ్యక్షులు బొర్రా.రాజేష్,కోశాధికారి కొలిపాకుల.ప్రకాష్, ఇజ్జిన. కిరణ్, ఎస్. ఎస్ . ఆలీషా,బాతు. ఆనంద్, ఎస్కే. ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment