కఠినతరమైన ఆంక్షలతో.. కరోనా ను దూరం చేద్దాం
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్
చిత్తూరు, పెన్ పవర్
చిత్తూర్ జిల్లా వరదయ్యపాలెం మండలం కడూరు రెడ్ కంటైన్మెంట్ జోన్ ను యస్.పి.సెంధింల్ కుమార్ పరిశీలించారు.వాహనాలు రెడ్ జోన్ పరిధిలో నిలపరాదని,ఆంక్షలు మరింత ఖటినతరం చేయాలని సూచించారు. వారికి కావలసిన పాలు, త్రాగునీరు, కూరగాయలు లాంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేయాలని తహశీల్దారు ను సూచించారు.రంజాన్ సంధర్భంగా ప్రతి ఇంటికి పండ్లు, నిత్యవసర సరుకులు డోర్ డెలివరి చెయ్యాలని తెలిపారు. డి.యస్.పి మాట్లాడుతూ బాబురావ్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంక్షలు మరింత ఖటినంగా ఉంటాయన్నారు.స్పెషల్ పార్టీ పోలీసులను పిలిపించామని వరదయ్యపాలెం కు వెళ్ళాలనుకోవడం మరచిపోండని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట పుత్తూరు, శ్రీసిటీ డీఎస్పీలు మురళీధర్, విమల కుమారి, సత్యవేడు సిఐ బివి శ్రీనివాసులు, వరదయ్యపాలెం ఎస్సై పురుషోత్తం రెడ్డి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నటరాజన్, ముని రాజా, మణీ కండన్, కవి అరుసు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment