రంగు సారా అమ్ముతున్న యువకుడు అరెస్ట్
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
నాటు సారాకు రంగు కలిపి క్వార్టర్ బాటిల్ ్సలో నింపి విక్రయిస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.కరోనా లాక్ డౌన్ తో మందు దొరక్క మందు బాబు లు విలవిల లాడిపోతున్నారు, ఇది గమనించిన ఆ యువకుడు నాటుసారాకు రాంగు కలిపి కలర్ వైన్ చేసి మద్యం క్వార్టర్ బాటిల్ లో నింపి మందు బాబుల కు కిక్కుని అందిస్తున్న డు.ఈ విషయం పసిగట్టిన పోలీసులు మాటువేసి బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు చోడవరం గ్రామంలో ని కోటవీధి కి చెందిన మాదిరెడ్డి కుమార్ కొడుకు మాదిరెడ్డి హేమంత్ @ సాయ (20) మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం లొ సారా తయారీ దార్ల వద్ద నుండి సారా ను రహస్యంగా తరలిస్తున్నాడు.తెల్లవారు జామున 15 లీటర్ల నాటుసారా తీసుకుని వచ్చి అందులో యదావిదిగా రంగు కలిపి ఖాళీ క్వార్టర్ సీసాల్లో నింపి 150 రూపాయలకు అమ్ముతున్నాడు. సాయంత్రం పి.ఎస్ పేటలో మందు బాబులకు రంగు సారా అమ్ము తుండగా మాటువేసిన పోలీసులు పట్టుకున్నారు. ట్రైనింగ్ డీఎస్సీ ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment