Followers

ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఇక్కట్లు


 


సమస్యలపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్సీ జగదీష్


 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పరిశీలించారు. గురువారం చెర్లోపల్లి ఖండం ప్రాంతాన్ని పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గురించి నిర్వహించిన సమీక్షలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పారిశ్రామిక తిరోగమనానికి నిదర్శనమనారు. పారిశ్రామిక ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇన్సెంటివ్స్ ప్రకటించిందని దాని ప్రకారం ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు సుమారు 4, 800 కోట్లు బకాయిలు పడిందని నేటికీ చెల్లించలేదని మోసపూరిత వాగ్దానాలు తో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది అని ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమ చక్కెర ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో 30 కోట్ల 59 లక్షలు గ్రాంట్ గా మంజూరు చేసిందని అందులో 16.07 కోట్లు ఇచ్చామన్నారు. 2018-2019 సీజన్లో ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు 1800 మందికి నేటికి ఒక పైసా చెల్లింపులు చేయలేదని ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రైతు బకాయిలు ఉద్యోగులు ఫ్యాక్టరీకి యంత్ర పరికరాలు సరఫరా చేసిన వారికి కలిపి ప్రభుత్వం 10 కోట్లు విడుదల చేసినట్లు జీవో ఇచ్చారు కాని పేమెంట్  మాత్రం జరగలేదన్నారు. దీనివలన రైతులు ఉద్యోగులు వ్యాపారులు మోసపోయారనారు. జిల్లాలో మిగతా ఫ్యాక్టరీకి ఇదేవిధంగా నిధులు మంజూరు చేసి రైతులకు చెల్లింపులు లేక జిల్లా లో  అన్ని ఫ్యాక్టరీలకు చెరుకు సరఫరా చేసిన రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు పడుతూ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను బ్యాంకులో నాలుగు కోట్లు డిపాజిట్ ఉన్న సొమ్ముని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...